: మోతెలో ముడుపు చెల్లించుకున్న కేసీఆర్
నిజామాబాద్ జిల్లా మోతెలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మొక్కు చెల్లించుకున్నారు. 2001లో తెలంగాణ రావాలని కోరుతూ కేసీఆర్ మోతెలో మట్టిని ముడుపు కట్టారు. తెలంగాణ వచ్చిన తర్వాత ముడుపు విప్పుతానని అన్నారు. ఇప్పుడు తెలంగాణ రావడంతో ఆయన మోతెలో మట్టిని చల్లి ముడుపు చెల్లించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తాను బతికున్నంత కాలం మోతె తనకు సొంత ఊరు అని తెలిపారు. మోతెకు గోదావరి నీరు తెప్పిస్తామని, పసుపు పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.