: ఆప్ కు నేను మద్దతు తెలపడంలేదు: అమీర్ ఖాన్


నటుడు అమీర్ ఖాన్ పెద్ద చిక్కులోనే పడ్డాడు. ఆమ్ ఆద్మీ పార్టీకి తాను మద్దతు తెలుపుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండిస్తూ ఎన్నికల సంఘానికి లేఖ రాశాడు. ఆప్ సహా ఎలాంటి రాజకీయ పార్టీకి తాను మద్దతు ఇవ్వడం లేదని స్పష్టం చేశాడు. కాగా, కొంతమంది ఏఏపీ అభ్యర్థులు ట్విట్టర్లో అమీర్ ఫోటోతో ఉన్న ప్రచార పోస్టర్లను పోస్టు చేసి, 'ధూమ్ 3' నటుడు తమ పార్టీకి మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు. ఈ విషయం అమీర్ దృష్టికి రావడంతో స్పందించి వెంటనే క్లారిటీ ఇచ్చారు. అంతకముందు ఇదే విషయంపై ఆయన అధికారి ప్రతినిధి కూడా ప్రకటన కూడా చేశారు.

  • Loading...

More Telugu News