: స్వాతంత్ర్యం వచ్చిన 67 ఏళ్లకు వారికి ఓటు హక్కు!


స్వాతంత్ర్యం ఎప్పుడో వచ్చింది. దేశంలో ఎన్నోసార్లు ఎన్నికలు జరిగాయి. కానీ, మేఘాలయలోని తూర్పు ఖాశీ జిల్లాలో కొందరు ఇప్పటికి ఒక్కసారి కూడా ఓటు వేయలేదు. భారత, బంగ్లా సరిహద్దుల్లోని 14 గ్రామాల్లో నివసిస్తున్న 7వేల మంది ఇప్పటికీ ఓటర్లుగా నమోదు చేసుకోలేదు. వీరిలో కేవలం 272 మంది మాత్రం ఓటర్లుగా నమోదు చేసుకుని త్వరలో జరిగే లోక్ సభ ఎన్నికల్లో తొలిసారిగా ఓటు వేయబోతున్నారని గ్రామ సెక్రటరీ బ్రోస్టార్ వోరా తెలిపారు. వీరు గత అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి సారి ఓటు వేశారని చెప్పారు. అంటే లోక్ సభ ఎన్నికల్లో వారు ఓటు వేయడం ఇదే ప్రథమం. అంతర్జాతీయ సరిహద్దుల్లో నివసిస్తున్న వీరికి ఓటు హక్కుపై మక్కువ లేనట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News