: మీడియా మైకులు నెట్టేవేసిన బొత్స


శంషాబాద్ విమానాశ్రయంలో మాజీ పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ మీడియా మైకులను ఒక్కసారిగా నెట్టివేశారు. ఢిల్లీ నుంచి హైదరాబాదు తిరిగి వచ్చిన ఆయనను ఒక్కసారే చుట్టుముట్టిన మీడియా వారు.. పార్టీ మారుతారా? అని ప్రశ్నించారు. అందుకు తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ఆయన, మీడియా పట్ల దురుసుగా ప్రవర్తించారు. కాగా, సత్తిబాబు కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరేందుకు ఇటీవల సీనియర్ నేత వెంకయ్యనాయుడుని కలిశారని వార్తలు వచ్చాయి. వీటిపై నిన్ననే స్పందించిన వెంకయ్య, బొత్స ఆ వార్తలను ఖండించారు.

  • Loading...

More Telugu News