: పోలింగ్ ను 7 గంటల వరకు పొడిగించాలని కోరుతున్న బీజేపీ నేత


లోక్ సభ ఎన్నికలలో పోలింగ్ సమయాన్ని సాయంత్రం 7 గంటల వరకు పొడిగించాలని మధ్యప్రదేశ్ బీజేపీ ఎంపీ అనిల్ దవే డిమాండ్ చేస్తున్నారు. నిజానికి పోలింగ్ సమయాన్ని ఎన్నికల సంఘం ఇప్పటికే సాయంత్రం 6 గంటల వరకు పొడిగించింది. అయితే, మరింత మంది ఓటింగ్ లో పాల్గొనేందుకు వీలుగా ఆ సమయాన్ని 7 గంటల వరకు పొడిగించాలని దవే కోరుతున్నారు. మండే వేసవిలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా సమయాన్ని పొడిగించాల్సిన అవసరం ఉందంటున్నారు. ఇటీవల ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఈశాన్య రాష్ట్రాలను మినహాయిస్తే మిగతా అన్ని ప్రాంతాలలో పోలింగ్ ఉదయం 7గంటలకు మొదలై సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. ఈశాన్య రాష్ట్రాలు, భద్రత పరంగా కొన్ని సున్నిత ప్రాంతాలలో మాత్రం పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకే ఉంటుంది.

  • Loading...

More Telugu News