: జమ్మూ కాశ్మీర్ లోని కథువా జిల్లాలో ఉగ్రవాదుల దాడి
జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. కథువా జిల్లాలో సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు (భారీగా పేలుడు పదార్థాలు కలిగి ఉన్నారు) ఓ కారును అపహరించి సాధారణ పౌరులపై కాల్పులు జరిపారు. అనంతరం కొంత దూరం ప్రయాణించి జంగ్లోట్ ప్రాంతంలో ఉన్న ఆర్మీ క్యాంప్ దగ్గర ఓ సైనికుడిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా నలుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో జవాను కూడా ఉన్నారు. ఆర్మీ క్యాంపులో ఏడువందల మంది సైనికులు ఉన్నారు. ప్రస్తుతం సైనికులకు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.