: నటుడిగా నాకు ఓనమాలు నేర్పింది వైజాగే: పవన్


తనకు విశాఖపట్నం అంటే ఎంతో ఇష్టమంటూ పవన్ ప్రసంగం ఆరంభించారు. వైజాగ్ నటుడిగా తనకు ఓనమాలు నేర్పిందని చెప్పారు. అప్పట్లో తాను నటనలో పాఠాలు నేర్చుకునే సమయంలో ఎక్కువగా భీమిలి వెళ్ళేవాణ్ణని తెలిపారు. నేడు సభ కోసం విశాఖ వచ్చి హోటల్ నుంచి సముద్రాన్ని చూస్తే పాత జ్ఞాపకాలు మదిలో మెదిలాయని చెప్పారు. ఆ సముద్రం ఒకరికి సలాం చేయదని, అందుకే తనకు సముద్రం అంటే ఇష్టమని తెలిపారు.

  • Loading...

More Telugu News