: సుష్మ ఉప ప్రధాని అవుతుందంటున్న మంత్రి
భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల్లో విజయదుందుభి మోగించడం ఖాయమన్న ధీమా ఆ పార్టీ వర్గాల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి సురేంద్ర పట్వా ఏమంటున్నారో వినండి. సీనియర్ నేత సుష్మా స్వరాజ్ ఉప ప్రధాని అవుతుందని జోస్యం చెబుతున్నారు. మధ్యప్రదేశ్ లోని బాడి వద్ద జరిగిన ఓ సభలో ఆయన సుష్మ సమక్షంలోనే ఈ వ్యాఖ్యలు చేశారు. ఆమెకు అన్ని అర్హతలు ఉన్నాయని పట్వా పేర్కొన్నారు.