: బెజవాడలో బాబుకు ఘనస్వాగతం
నేడు టీడీపీ మహిళా గర్జన సభకు హాజరయ్యేందుకు చంద్రబాబు నాయుడు విజయవాడ చేరుకున్నారు. ఆయనకు స్థానిక డీవీ మేనర్ హోటల్ వద్ద పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ సాయంత్రం ఇక్కడి సింగ్ నగర్లో జరిగే మహిళా గర్జనలో బాబు పాల్గొని ప్రసంగించనున్నారు. కాగా, బెజవాడ వచ్చిన తెలుగుదేశం పార్టీ అధినేతను అర్చకుల సంఘం ప్రతినిధులు కలిశారు. ఆయనకు తమ సమస్యలు విన్నవించుకున్నారు. బాబు పాలనలోనే తాము సుఖంగా ఉన్నామని వారు తెలిపారు.