: సుప్రీం చెబితే ఓకే అంటున్న సన్నీ


మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కు ఎంచక్కని అవకాశం ముంగిట నిలిచింది. క్రికెట్ బోర్డులో ఆటగాళ్ళకే ప్రాధాన్యం ఉండాలని ఎన్నాళ్ళ నుంచో చెబుతున్న ఈ దిగ్గజానికి సుప్రీం తాజా సూచనలు సంతోషాన్నిచ్చేవే. ఐపీఎల్ ఫిక్సింగ్ కేసులో నేడు విచారణ జరిపిన సుప్రీం కోర్టు... బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి ఎన్.శ్రీనివాసన్ తప్పుకున్నాక గవాస్కర్ కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని పేర్కొంది. దీనిపై గవాస్కర్ స్పందిస్తూ సుప్రీం చెబితే సంతోషంగా బాధ్యతలు స్వీకరిస్తానని చెప్పారు. అయితే, ఏ వ్యక్తి కూడా నేరం నిరూపితం కానంతవరకు దోషి కాడని శ్రీనివాసన్ కు మద్దతుగా మాట్లాడారు.

  • Loading...

More Telugu News