: నేటి నుంచి పదోతరగతి పరీక్షలు
రాష్ట్ర వ్యాప్తంగా పదోతరగతి పరీక్షలు ఈ రోజు ప్రారంభంకానున్నాయి. ఈ పరీక్షలకు మొత్తం 12 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరుకానున్నారు. ఈ రోజు నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు పరీక్షలు ఉదయం 9.30గంటల నుంచి 12 గంటల వరకు జరగనున్నాయి. తొలి రెండు రోజులు అనివార్యకారణాలవల్ల అరగంట ఆలస్యంగా వచ్చినా పరీక్షకు హాజరయ్యేందుకు అధికారులు అనుమతిస్తారు.