: మూడోరోజూ నిరసన దీక్ష కొనసాగిస్తోన్న టీడీపీ
రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపు, సర్ ఛార్జీల మీద తెలుగుదేశం పార్టీ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కొనసాగిస్తోన్న నిరాహార దీక్షలు నేటికి మూడోరోజుకు చేరాయి. ప్రభుత్వం ఈ సమస్యపై స్పందించి తగిన చర్యలు తీసుకోకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని టీడీపీ నేతలు అంటున్నారు. పలు పార్టీల నేతలు దీక్ష శిబిరాన్ని సందర్శించి తమ సంఘీభావం ప్రకటిస్తున్నారు.
ఇవాళ టీడీపీ నేత కడియం శ్రీహరి దీక్ష శిబిరాన్ని సందర్శించారు. విద్యుత్ సమస్యపై తమ పార్టీ చేస్తోన్న దీక్షను అధికార పర్టీ అవహేళన చేయడం సరికాదన్నారు.