: యూకేలో టీనేజ్ బాలికలకు ఉచితంగా కండోమ్స్, పిల్స్
బ్రిటన్ లో అవాంఛనీయ గర్భాలను అరికట్టేందుకు అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో అక్కడి పాఠశాలల్లోని టీనేజ్ బాలికలకు ఉచితంగా కండోమ్స్, గర్భ నిరోధక మాత్రలు సరఫరా చేయాలని నిర్ణయించింది. యూరప్ లో టీనేజ్ గర్భాల విషయంలో ఇంగ్లండే ముందుండడంతో ఈ చర్యలు తప్పడం లేదు. నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ కేర్ ఎక్స్ లెన్స్ (నైస్) సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.