: మాజీ మంత్రుల నివాసాలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరణ


మాజీ మంత్రులకు ఈరోజు ఉదయం విద్యుత్ అధికారులు షాక్ ఇచ్చారు. విద్యుత్ వినియోగించుకుని బిల్లులు చెల్లించకపోవడంతో హైదరాబాదు, బంజారాహిల్స్ లోని మాజీ మంత్రుల నివాస సముదాయానికి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. రెండు నెలలకు గాను రూ. 24 లక్షలు విద్యుత్ బకాయి ఉండటంతో విద్యుత్ ను నిలిపివేసినట్లు అధికారులు చెప్పారు. అయితే, కొద్దిసేపటి క్రితం తిరిగి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. బకాయి పడిన బిల్లు చెల్లించారా? లేదా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News