: వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించిన మోడీ


బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ నేడు జమ్మూకాశ్మీర్లోని సుప్రసిద్ధ హైందవ క్షేత్రం వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించారు. కథువా జిల్లాలోని హీరానగర్ పట్టణంలో ఆయన నేడు ఓ బహిరంగ సభలో పాల్గొంటున్నారు. మార్గమధ్యంలో దేవిని దర్శించుకున్నారు. సంక్లిష్టమైన దారిలో గుర్రంపై తాను వెళుతున్న ఫొటోను మోడీ నేడు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. 'జై మాతాదీ! సంజిచాట్ నుంచి వైష్ణోదేవి ఆలయానికి వెళుతున్నా' అని ట్వీట్ చేశారు. కాగా, మోడీ రాక సందర్భంగా హీరానగర్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. సభకు వేదిక అయిన హాకీ స్టేడియం వద్ద పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు.

  • Loading...

More Telugu News