: పార్టీ నుంచి పొమ్మనడానికి వాళ్లెవరు?: అళగిరి


తనను డీఎంకే పార్టీ నుంచి తొలగించడంపై కరుణానిధి తనయుడు అళగరి మండిపడ్డారు. పార్టీ నుంచి తనను తొలగించే హక్కు ఎవరికీ లేదని పేర్కొన్నారు. ఈ ఉదయం జాతీయ మీడియాతో మాట్లాడుతూ, 'డీఎంకేలో నాకూ హక్కుంది. ఆ పార్టీతో నాకు సంబంధం లేదని ఎవరూ చెప్పలేరు. డీఎంకే ప్రధాన కార్యాలయ నిర్మాణంలో నా శ్రమ కూడా ఉంది. ఇక, పార్టీ అధ్యక్షుడిగా స్టాలిన్ బాధ్యతలు చేపట్టినా లెక్కచేయను' అని పేర్కొన్నారు. మధురై సిట్టింగ్ ఎంపీ అయిన అళగరి ఈ పర్యాయం ఎన్నికల్లో పోటీచేయబోనని తెలిపారు. పార్టీ నుంచి తనను తొలగించడంపై కోర్టులోనే తేల్చుకుంటానని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News