: బడుగు బలహీన వర్గాల పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలి : మోత్కుపల్లి
బడుగు బలహీన వర్గాల పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు ప్రజలకు పిలుపునిచ్చారు. మహబూబ్ నగర్ వేదికగా జరుగుతున్న ప్రజాగర్జన సభలో ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కాంగ్రెస్ పార్టీలపై విరుచుకుపడ్డారు. కేసీఆర్ పునర్నిర్మాణమంటే తెలంగాణలో దొరల పాలన తీసుకురావడమేనా? అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ ప్రజలకోసం కంటే తన కుటుంబం కోసం ఆరాటపడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఇక కాంగ్రెస్ పాలనలో ధరలు విపరీతంగా పెరిగాయన్న ఆయన, ముఖ్యమంత్రులను మార్చుకోవడమే ఆ పార్టీ పని అని విమర్శించారు.