: టి20 బ్యాట్స్ మన్ గా రైనాను వేలెత్తిచూపలేం: గంగూలీ


టి20 ఫార్మాట్లో సురేశ్ రైనా గణాంకాలే అతనేంటో చెబుతాయని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నాడు. టి20 క్రికెట్లో రైనాను వేలెత్తి చూపలేమని గంగూలీ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్ లో జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో రాణించడం రైనాకు మున్ముందు మరింత ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుందని దాదా చెప్పాడు. మిర్పూర్ లో మీడియాతో మాట్లాడుతూ, 'రైనా ప్రతిభపై నాకెలాంటి అనుమానాల్లేవు. ఏ జట్టుకైనా రైనా పెను ముప్పే' అని పేర్కొన్నాడు.

రైనా టి20 వరల్డ్ కప్ కు ముందు వార్మప్ మ్యాచ్ లలో 41, 54 స్కోర్లు సాధించాడు. ఇక, చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆ పోరులో 35 పరుగులతో అజేయంగా నిలిచాడు.

  • Loading...

More Telugu News