: ప్రముఖ నటుడు కులదీప్ పవార్ కన్నుమూత
ప్రముఖ మరాఠీ నటుడు కులదీప్ పవార్ ఇకలేరు. కిడ్నీ ఫెయిల్యూర్ తో కొంతకాలంగా బాధపడుతున్న ఆయన ముంబయిలోని కోకిలాబెన్ అంబానీ ఆసుపత్రిలో ఈ రోజు తుదిశ్వాస విడిచారు. తను చేసిన సినిమాల్లో నెగిటివ్ పాత్రలతో ఫేమస్ అయిన కులదీప్.. 'గప్ చుప్ గప్ చుప్', 'షపిత్', 'ఆరే సన్సార్ సన్సార్','వజిర్' ఆయన నటించిన ప్రధాన మరాఠీ చిత్రాలు. 'పరమ్ వీర్' అనే సీరియల్ తో అత్యంత ఆదరణ పొందారు. కుటుంబసభ్యులు, స్నేహితుల సమక్షంలో కొల్హాపూర్ లో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.