: దేశం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజలకు వివరిస్తా: వెంకయ్య నాయుడు
బీజేపీ జాతీయ నేత ముప్పవరపు వెంకయ్య నాయుడు ఈరోజు ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. భారతీయ జనతాపార్టీ ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేందుకు ప్రణాళిక రచించినట్లు వెంకయ్య చెప్పారు. దేశవ్యాప్తంగా సుమారు 100 ర్యాలీల్లో పాల్గొంటానని ఆయన తెలిపారు. మొన్న తమిళనాడులో ఎన్నికల ప్రచారం ప్రారంభించానని, త్వరలో కేరళ, అండమాన్ లకు వెళ్లనున్నట్లు ఆయన చెప్పారు.
మన రాష్ట్రంలో కర్నూలు, చిత్తూరు, మదనపల్లిలో జరిగే ర్యాలీ, ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటానని ఆయన అన్నారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యలను ఈ ర్యాలీల్లో ప్రజలకు వివరించనున్నట్లు వెంకయ్య తెలిపారు. దేశానికి పట్టిన కాంగ్రెస్ శనిని వదిలించుకోవాలంటే, భావి ప్రధానిగా నరేంద్ర మోడీనే సమర్థుడని ఆయన పునరుద్ఘాటించారు.