: బాండ్ మెచ్చిన కారు


మామూలు కార్లకు జేమ్స్ బాండ్ చిత్రాల్లో హీరో ఉపయోగించే కారుకు తేడా ఏమిటో తెలుసా!? సాధారణ కార్లు యాంత్రికంగా నడిస్తే, బాండ్ కార్లు కృత్రిమ మేధస్సుతో దూసుకెళతాయి. ఫైటర్ జెట్ లు మాత్రమే ప్రయోగించగల అత్యాధునిక క్షిపణులను అలవోకగా సంధిస్తాయి. అడ్డొస్తే, కొండలనైనా పిండిచేస్తాయి. నింగి, నీరు, నేలా ఎక్కడైనా వాటికి తిరుగులేదన్నంతగా విశృంఖల విహారం చేస్తాయి. సరిగ్గా అలాంటిదే మా కారు అంటోంది ల్యాండ్ రోవర్ సంస్థ.

టాటా గ్రూప్ కు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ తాజాగా రేంజ్ రోవర్ స్పోర్ట్స్ పేరిట ఓ కొత్త తరం కారును మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. మొత్తం అల్యూమినియంతో తయారైన ఈ కారును న్యూయార్క్ లో ఆవిష్కరించారు. జేమ్స్ బాండ్ చిత్రాల కథానాయకుడు డేనియల్ క్రెగ్ ఈ కొత్త రోవర్ ను టెస్ట్ డ్రైవ్ చేశాడు. క్రెగ్ కారును నడుపుతున్న సమయంలో న్యూయార్క్ లోని ప్రధాన రహదారుల్లో పోలీసులు ట్రాఫిక్ ను మళ్ళించారట.

డ్రైవింగ్ అనంతరం క్రెగ్ సంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ ఆధునిక ల్యాండ్ రోవర్ బాండ్ ఇటీవలి చిత్రం స్కైఫాల్ లోనూ వినియోగించారు. కాగా, ఈ కారు ఆడి క్యూ7, బీఎండబ్ల్యూ ఎక్స్5, ఫోక్స్ వాగన్ టౌరెగ్ లకు గట్టిపోటీనివ్వడం ఖాయమని ఆటోమొబైల్ వర్గాలంటున్నాయి. ఇంతకీ కారు ధర చెప్పనేలేదు కదూ..! భారత్ లో ఈ కారు ధర సుమారు రూ. 72 లక్షలు ఉంటుందని ఓ అంచనా. 

  • Loading...

More Telugu News