: సీపీ అనురాగ్ శర్మను కలసిన జూనియర్ ఆర్టిస్టులు
బుల్లితెర నటి, చిట్టీల వ్యాపారి విజయారాణి చేతిలో మోసపోయిన జూనియర్ ఆర్టిస్టులు ఈరోజు హైదరాబాదు పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మను కలిశారు. చిట్టీల పేరుతో తమను మోసం చేసిన విజయారాణిని వెంటనే అరెస్టు చేయాలని కోరారు. తమ వద్ద వసూలు చేసిన రూ.10 కోట్లతో ఆమె పరారైందని చెప్పారు. స్పందించిన అనురాగ్ శర్మ, ఈ కేసు దర్యాప్తులో వేగం పెంచామని, ఆమెను వెంటనే అరెస్టు చేసేందుకు రెండు టీమ్ లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.