: కోతులను కొట్టబోయిన ఆ వ్యక్తికి ‘శూల దండన’..!


ఇంటిపైకి వచ్చిన కోతులను కొట్టేందుకు వెళ్లిన ఓ వ్యక్తి శూల దండనకు గురయ్యాడు. ఈ ఘటన భూపాలపల్లి మండలం కార్లీమాక్స్ కాలనీలో జరిగింది. ప్రభాకర్ అనే వ్యక్తి వానరాలను తరిమేసేందుకు ఇంటిపైకెక్కాడు. అయితే సిమెంట్ రేకు విరిగిపడి ప్రమాదవశాత్తు ఇంటి ప్రహరీ గోడపైనున్న రాడ్డుపై పడ్డాడు. దాంతో రాడ్ కడుపు కింది భాగంలోకి చొచ్చుకెళ్లిపోయింది. దీంతో నొప్పిని తట్టుకోలేక అతడు విలవిల్లాడిపోయాడు. రాడ్డును పట్టుకుని అలాగే కుప్పకూలిపోయాడు. ఈ విషయాన్ని గమనించిన ఇరుగుపొరుగువారు పోలీసులకు సమాచారమందించారు. సింగరేణి రెస్క్యూ టీమ్ సాయంతో రాడ్ ను కట్ చేసి 108 వాహనంలో అతడిని ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News