: టీఆర్ఎస్ పై సుధాకర్ విమర్శలు... రాజీనామా


తెలంగాణ రాష్ట్ర సమితికి ఆ పార్టీ నేత చెరుకు సుధాకర్ రాజీనామా చేశారు. అనంతరం తీవ్ర విమర్శలు చేసిన ఆయన, ఏం చేశానని తనను దూరం పెట్టారని పార్టీ అధినేత కేసీఆర్ ను ప్రశ్నించారు. ఎన్నికల బరిలో దిగేందుకు తాను సరైన అభ్యర్థి కాదని టీఆర్ఎస్ నేత కేకే చెప్పగలుగుతారా? అంటూ సవాల్ విసిరారు. ఇంతకాలం ఉద్యమ పార్టీగా చెప్పుకున్న టీఆర్ఎస్... ఇప్పుడు రాజకీయ పార్టీగా చెప్పుకుంటోందని... అలాంటప్పుడు తెలంగాణలో టీడీపీ, వైఎస్సార్సీపీ, సీపీఎంలు కూడా అంటరాని పార్టీలు కావన్నారు. అన్ని పార్టీలు ఎన్నికల్లో పోటీ చేయవచ్చని చెప్పారు. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ తరపున పని చేసిన కొండా దంపతులు ఎన్నికల్లో గెలిస్తే ఉద్యమ పార్టీగా చెప్పుకున్న టీఆర్ఎస్ గొప్పతనం ఏముంటుందని నిలదీశారు. తెలంగాణ ప్రజలు మానసిక సంఘర్షణకు లోనవుతున్నారని, ఎన్నికల్లో స్నేహపూర్వక పోటీనే కోరుకుంటున్నారని చెప్పారు.

  • Loading...

More Telugu News