: గవర్నర్ ఆదేశంతో కేసు నమోదు...దర్యాప్తు షురూ


పీజీ మెడికల్ ప్రవేశ పరీక్షలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు చేసిన ఉన్నత విద్యాశాఖాధికారులు తమ నివేదికను రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కు అందజేశారు. నివేదిక ప్రకారం, గవర్నర్ సీఐడీ విచారణకు ఆదేశించారు. దీంతో కేసును టేకప్ చేసిన సీఐడీ అధికారులు ఐపీసీ సెక్షన్లు 120(బి), 420, పబ్లిక్ యాక్ట్ ఎగ్జామినేషన్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణకు సీఐడీ ఆరు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది. విజయవాడ, గుంటూరు, విశాఖ, బెంగళూరుకు ఈ ప్రత్యేక బృందాలు బయల్దేరి వెళ్లాయి. పీజీ మెడికల్ కౌన్సిలింగ్ ఏప్రిల్ 1న ప్రారంభం కావాల్సి ఉంది. దీంతో కౌన్సిలింగ్ ప్రారంభించేనాటికి సీఐడీ నివేదిక సిద్ధం చేసి గవర్నర్ కు సమర్పిస్తుందో లేదో చూడాలి.

  • Loading...

More Telugu News