: పవార్ వ్యాఖ్యలపై వివరణ కోరిన ఈసీ
'వచ్చే ఎన్నికల్లో ఒక్కొక్కరూ రెండు ఓట్లు వేయండి' అంటూ మహారాష్ట్రలో మొన్న (ఆదివారం) నిర్వహించిన ర్యాలీలో పార్టీ కార్యకర్తలను కోరిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం వివరణ కోరింది. గురువారం సాయంత్రం ఐదు గంటల లోపు తమకు సమాధానం ఇవ్వాలని పవార్ కు రాసిన లేఖలో ఆదేశించింది. ఈ ఉదంతంపై పలువురు చేసిన ఫిర్యాదుల మేరకు ఆయన వ్యాఖ్యల వీడియో పుటేజ్ ను పరిశీలించిన ఈసీ మండిపడింది. ఎన్నికల నియమావళిని పవార్ ఉల్లంఘించారని తేల్చింది.