: స్త్రీలకు ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటించండి: షారూక్ కు షబానా అజ్మి సూచన


స్త్రీ పాత్రలకు ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటించాలని బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ కు నటి, సామాజిక కార్యకర్త షబానా అజ్మి సలహా ఇచ్చారు. అప్పుడే షారూఖ్ కు, ఆయన వెల్లడించిన ఉద్దేశానికి మరింత గౌరవం దక్కుతుందని ఆమె అన్నారు. ఇక నుంచి తన చిత్రాల టైటిళ్లలో తన పేరుకన్నా ముందు కథానాయిక పేరు వేసేలా చూస్తానంటూ కొన్నిరోజుల కిందట షారుఖ్ చెప్పారు. ఇప్పుడా మాటలపై ట్విట్టర్ లో స్పందించిన షబానా అజ్మి పైవిధంగా అన్నారు. 

  • Loading...

More Telugu News