: ఫిఫా వరల్డ్ కప్ కోసం షకీరా కొత్త పాట
ఇంటర్నేషనల్ పాప్ స్టార్ షకీరా (37) సాకర్ వరల్డ్ కప్ కోసం మరో గీతాన్ని రూపొందించింది. 2010 ఫిఫా వరల్డ్ కప్ టోర్నీ సందర్భంగా ఆమె రూపొందించిన 'వకా వకా' గీతం ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందింది. తాజాగా ఈ లాటిన్ సుందరి బ్రెజిల్ ఆతిథ్యమిస్తోన్న 2014 ఫిఫా ప్రపంచకప్ కోసం 'లా లా లా' అంటూ స్వరాలాపన చేసింది. ఈ పాటలో పదాలు బ్రెజిల్ భాషలో ఉంటాయని, తానే రాశానని చెప్పందీ డ్యాన్సింగ్ స్టార్. కాగా, ఈ పాటలో ఆమె తనయుడు మిలాన్ కూడా గొంతు కలపడం విశేషం. బ్రెజిల్ లో ఫిఫా వరల్డ్ కప్ ఈ వేసవిలో జరగనుంది.