: 'కొచ్చాడయాన్' హిట్టవ్వాలని రజనీ ఫ్యాన్స్ తిరుపతి పాదయాత్ర


తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు ఏప్రిల్ 2న తిరుపతికి పాదయాత్ర చేపట్టనున్నారు. ఆయన నటించిన కొచ్చాడయాన్ సినిమా ఏప్రిల్ 11న విడుదల కానుంది. ఆ సినిమా హిట్టవ్వాలని కోరుతూ ఫ్యాన్స్ కాలినడకన వెల్లూరు నుంచి తిరుమల కొండపైకి చేరుకోవాలని సంకల్పించారు.

ఈ విషయమై వెల్లూరు రజనీకాంత్ ఫ్యాన్ క్లబ్ ట్రెజరర్ రవి మాట్లాడుతూ, 'రజనీ సినిమా రెండేళ్ళ తర్వాత విడుదల అవుతోంది., ఆ సినిమా హిట్టవ్వాలని, అలాగే తమ ప్రియతమ హీరో ఆరోగ్యం బాగుండాలని కూడా దేవుణ్ణి ప్రార్థిస్తాం' అని పేర్కొన్నారు. కాగా, ఈ 3డీ యానిమేటెడ్ చిత్రం రజనీ కుమార్తె సౌందర్య దర్శకత్వంలో తెరకెక్కింది. దీపికా పదుకొనే కథానాయిక కాగా, జాకీ ష్రాఫ్, శరత్ కుమార్, నాజర్, ఆది పినిశెట్టి తదితరులు ముఖ్యపాత్ర పోషించారు.

  • Loading...

More Telugu News