: రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ కురియన్ కు కోర్టు నోటీసులు


కేరళ 'సూర్యనెల్లి' అత్యాచారం కేసులో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పిజె.కురియన్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో కేరళలోని తొడుపుజ సెషన్స్ కోర్టు కురియన్ కు నోటీసులు జారీ చేసింది. ప్రధమ నిందితుడు ధర్మరాజన్, మరో ఇద్దరు నిందితులు జమల్, ఉన్నిక్రిష్ణన్ తో పాటు రాష్ట్ర  ప్రభుత్వానికి కూడా జడ్జి అబ్రహాం మాథ్యూ నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే తిరువనంతపురం జైలులో ఉన్న ధర్మరాజన్ ను మే 29న తమ ఎదుట హాజరుపరచాలని న్యాయస్థానం ఆదేశించింది.

మరోపక్క, బాధితురాలు దాఖలు చేసిన క్రిమినల్ రివిజన్ పిటిషన్ పై విచారణను కూడా అదే రోజుకు కోర్టు వాయిదా వేసింది. ఈ కేసుతో కురియన్ కు ఉన్న సంబంధంపై దర్యాప్తు చేపట్టాలంటూ  గతంలో బాధితురాలు వేసిన పిటిషన్ ను పీర్ మెడు జ్యుడిషియల్ మొదటితరగతి మేజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించింది. దీంతో ఆమె సెషన్స్ కోర్టును ఆశ్రయించింది.

  • Loading...

More Telugu News