: జస్వంత్ లాంటి జంటిల్మన్లను కాదని గుండాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు: ఒమర్ అబ్దుల్లా


బీజేపీ వ్యవహారశైలిపై జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మండిపడ్డారు. జస్వంత్ సింగ్ లాంటి జంటిల్మన్ లకు టికెట్లను నిరాకరిస్తూ... ప్రమోద్ ముతాలిక్ (శ్రీరామ్ సేన చీఫ్) లాంటి గుండాలకు బీజేపీలో పెద్దపీట వేస్తున్నారని ఆరోపించారు. ఈ విధానం భారతదేశ భవిష్యత్తుకు మంచిది కాదని హెచ్చరించారు. బీజేపీ నిర్ణయాలు ప్రమాదకరంగా మారాయని... దేశ రాజకీయాల్లో సంభవిస్తున్న ఇలాంటి ఘటనల పట్ల భారతీయులందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

  • Loading...

More Telugu News