: టీఆర్ఎస్ ది కాలయాపనే... మేం క్లియర్: నారాయణ
టీఆర్ఎస్ కాలయాపన చేస్తోంది తప్ప పారదర్శకంగా వ్యవహరించడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆరోపించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, సిట్టింగ్ సీట్ల విషయంలో తాము క్లియర్ గా ఉన్నామని, ఆ విషయంలో చర్చలు లేవని స్పష్టం చేశారు. మరోసారి నిర్దిష్ట ప్రతిపాదన ఇచ్చామని, సాయంత్రం లోపు తేల్చాలని ఆయన అల్టిమేటం జారీ చేశారు. 15 రోజుల క్రితం ఇచ్చిన జాబితాను చర్చించకుండా, మళ్లీ కొత్తగా చర్చలు అంటున్నారని ఆయన మండిపడ్డారు. ఫోన్ చేస్తే స్పందించలేని స్థితిలో టీఆర్ఎస్ నాయకత్వం ఉందా? అని ఆయన వారిని నిలదీశారు.