: సీపీఐతో సానుకూల చర్చలు జరిగాయి: కేశవరావు


పొత్తుల విషయంలో సీపీఐ పార్టీతో సానుకూల వాతావరణంలోనే చర్చలు జరిగాయని టీఆర్ఎస్ నేత కె.కేశవరావు చెప్పారు. సీపీఐ పోటీ చేయాలనుకుంటున్న స్థానాలపై పార్టీలో చర్చించి తమ నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు. పొత్తులపై సీపీఐ నారాయణతో టీఆర్ఎస్ నేతలు కేకే, వినోద్ భేటీ అయ్యారు. ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన కేకే, తాను కాంగ్రెస్ లో చేరతానంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని వెల్లడించారు. కాగా, వచ్చే ఎన్నికల్లో పొత్తుల విషయంపై టీఆర్ఎస్ నుంచి ఇంకా స్పష్టత రాలేదని సీపీఐ నేతలు చాడ వెంకట్ రెడ్డి, అజీజ్ పాషా తెలిపారు. రెండు రోజుల్లో పొత్తులపై క్లారిటీ వస్తుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ కలసి పోటీ చేస్తామన్నారు.

  • Loading...

More Telugu News