: పార్టీ మారుతా: పితాని
పార్టీ మారుతానని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ తెలిపారు. దీంతో ఆయన టీడీపీలో చేరడం లాంఛనంగా మారింది. పోడూరు మండలం కొమ్ముచిక్కాల గ్రామంలో మంత్రి పితాని సత్యనారాయణ ఇంటిని కార్యర్తలు ముట్టడించారు. ఆచంట నియోజకవర్గంలోని ఆచంట, పెనుగొండ, పెనుమంట్ర, పోడూరు మండలాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు వచ్చి ఆందోళన చేపట్టారు. పితాని టీడీపీలో చేరాలని నినాదాలు చేశారు. దీంతో ఆయన కార్యకర్తలతో సమావేశమయ్యారు. తాను కార్యకర్తల అభీష్టం మేరకు పార్టీ మారుతానని తెలిపారు. కార్యకర్తల వెంటే నడుస్తానని ఆయన స్పష్టం చేశారు. దీంతో ఆయన టీడీపీలో చేరడం లాంఛనమే.