: స్వతంత్ర అభ్యర్థిగా జశ్వంత్ సింగ్ నామినేషన్


బీజేపీ తిరుగుబాటు నేత జశ్వంత్ సింగ్ రాజస్థాన్ లోని బార్మర్ ప్రాంతం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఈ మేరకు తన మద్దతుదారులతో కలసి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందించారు. పశ్చిమ బెంగాల్ ల్లోని డార్జిలింగ్ సిట్టింగ్ ఎంపీ అయిన జశ్వంత్ వచ్చే ఎన్నికలకు ఈసారి తన సొంత జిల్లా బార్మర్ నుంచి పోటీ చేయాలనుకున్నప్పటికీ బీజేపీ నిరాకరించింది. దాంతో, తీవ్ర నిరాశకు గురయిన ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇక కొద్ది రోజుల్లోనే బీజేపీని వీడనున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News