: బీజేపీలో స్థిరత్వం లేదు: మొయిలీ
బీజేపీలో స్థిరత్వం లేదని కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ ఎద్దేవా చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, బీజేపీ తీసుకునే నిర్ణయాల్లో పొంతన లేదని అన్నారు. శ్రీరామ సేన అధ్యక్షుడు ప్రమోద్ ముతాలిక్ ను పార్టీలో చేర్చుకుని బయటకు గెంటేయడాన్ని తప్పు పడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి ఒక ఎజెండా లేదని, ప్రస్తుతం బీజేపీలో నియంతృత్వం నడుస్తోందని ఆరోపించారు.
బీజేపీని విమర్శించిన మొయిలీ ఆప్ ను కూడా ఏకి పడేశారు. కేజ్రీవాల్ వీధిలో ఎవరినైనా కరుస్తారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గ్యాస్ ధర పెంపు విషయంలో కేజ్రీవాల్ చేసిన ఆరోపణలు వాస్తవదూరం అని ఆయన అన్నారు. కేబినెట్ నిర్ణయాన్ని తాము అమలు చేశామని ఆయన తెలిపారు.