: అభిమానంతోనే మోడీని నాగ్ కలవొచ్చు: చిరు
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని సినీ నటుడు అక్కినేని నాగార్జున ఈరోజు కలవనుండటంపై కేంద్ర మంత్రి చిరంజీవి స్పందించారు. ఈ మేరకు విజయవాడలో జరుగుతున్న పార్టీ బస్సు యాత్ర సందర్భంగా మాట్లాడిన చిరు, మోడీని నాగార్జున కలవడం అంత విశేషమేమి కాదన్నారు. ఆయనపై ఉన్న అభిమానంతోనే కలవొచ్చని అభిప్రాయపడ్డారు. ఇటీవలే నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అహ్మదాబాద్ వెళ్లి మోడీని కలసి వచ్చిన సంగతి తెలిసిందే.