: మా బ్యాటింగ్ సత్తాకు ఇంకా పరీక్ష ఎదురుకాలేదు: ధోనీ


వెస్టిండీస్ తో టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ నెగ్గిన అనంతరం టీమిండియా సారథి మహేంద్ర సింగ్ ధోనీ మీడియాతో మాట్లాడాడు. ఆడిన రెండు మ్యాచెస్ లోనూ కొందరు బ్యాట్స్ మెన్ కే అవకాశం వచ్చిందని, మిగతా బ్యాట్స్ మెన్ సత్తా చాటేందుకు ఎదురుచూస్తున్నారని చెప్పాడు. ఓ రకంగా చూస్తే టీమిండియా బ్యాటింగ్ లైనప్ కు పరీక్ష ఎదురుకాలేదని అభిప్రాయపడ్డాడు.

'చక్కగానే ఆడుతున్నాం. అయితే, అందరికీ బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చి, వాళ్ళు కూడా రాణిస్తే పట్టించుకోవాల్సి పనిలేదు. ఇప్పటివరకు బౌలింగ్ విభాగం పరీక్షకు గురైంది కానీ, బ్యాటింగ్ సత్తాకు సరైన పరీక్ష ఎదురుకాలేదు. రాబోయే మ్యాచ్ లలోనైనా అందరికీ అవకాశం వస్తుందని భావిస్తున్నా' అని పేర్కొన్నాడు. చివరి ఓవర్లలో పరిస్థితులకు తగిన విధంగా రాణించే బౌలర్ కోసం చూస్తున్నామని చెప్పాడు.

  • Loading...

More Telugu News