: గోదావరి మధ్యలో నిలిచిపోయిన ప్రయాణికుల పంటు!
పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం రేవు నుంచి తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి వస్తున్న పంటు సాంకేతిక లోపంతో ఈ మధ్యాహ్నం గోదావరినది మధ్యలో చాలాసేపు ఆగిపోయింది. దీంతో పంటులో వున్న 80 మంది ప్రయాణికులు భయంతో తల్లడిల్లారు. సమాచారం తెలుసుకున్న ప్రభుత్వాధికారులు తక్షణమే సహాయక చర్యలు చేపట్టి, ప్రయాణికులను ఐదు పడవలలో తీరానికి చేర్చారు. అందరూ సురక్షితంగా ఒడ్డుకు చేరడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.