: చంద్రబాబుకు కేసీఆర్ సూటి ప్రశ్న


తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి విషయం చంద్రబాబుకు ఇప్పుడు హఠాత్తుగా గుర్తొచ్చిందని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్లో మాట్లాడుతూ, చంద్రబాబుకు ఆయన సూటి ప్రశ్న సంధించారు. తెలంగాణలో బీసీ వ్యక్తిని సీఎం చేస్తానని చెబుతున్న బాబు, సీమాంధ్రలో బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఎందుకు ప్రకటించలేదని నిలదీశారు. కాగా, ముఖ్యమంత్రిగా కిరణ్ తీసుకున్న కొన్ని నిర్ణయాలపై చర్యలు తీసుకోవాలంటూ కేసీఆర్ గవర్నర్ కు బహిరంగ లేఖ రాశారు.

  • Loading...

More Telugu News