: ఉత్కంఠభరితంగా ఆసీస్, పాక్ మ్యాచ్
టి20 వరల్డ్ కప్ లో నేడు ఆసీస్, పాక్ జట్ల మధ్య మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. పాక్ విసిరిన 192 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కంగారూలు 14 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు నష్టపోయి 138 పరుగులు చేశారు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన గ్లెన్ మ్యాక్స్ వెల్ (33 బంతుల్లో 74; 7 ఫోర్లు, 4 సిక్సులు) ను అఫ్రిది అవుట్ చేశాడు. ప్రస్తుతం క్రీజులో ఫించ్ 47, బెయిలీ 2 పరుగులతోనూ ఉన్నారు. ఆసీస్ విజయం సాధించాలంటే 36 బంతుల్లో 54 పరుగులు చేయాలి. చేతిలో ఏడు వికెట్లున్నాయి.