: వార్ రూమ్ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ కు సందేశం


భువనగిరి పార్లమెంటు స్థానం విషయంలో ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని కాంగ్రెస్ వార్ రూమ్ నుంచి సిట్టింగ్ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సందేశం అందింది. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య భువనగిరి స్థానానికి తనపేరును ప్రతిపాదించుకోవడం పట్ల కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేసిన కొన్ని గంటల్లోనే ఈ సందేశం రావడం గమనార్హం. కాసేపటి క్రితం కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ ముగిసింది. దిగ్విజయ్ సింగ్, వాయలార్ రవి... డీఎస్, సబిత, మల్లు తదితరులతో సమావేశమై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.

కాగా, అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ 70 శాతం కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. సాయంత్రానికి ప్రాథమికంగా ఎంపిక ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఇక ఈ నెల 26న సోనియాతో స్క్రీనింగ్ కమిటీ భేటీ కానుంది. అనంతరం జాబితాలు ఖరారు చేస్తారు.

  • Loading...

More Telugu News