: పాక్ ను ఆదుకున్న అక్మల్ బ్రదర్స్
ఆస్ట్రేలియాతో టి20 వరల్డ్ కప్ మ్యాచ్ లో పాకిస్థాన్ జట్టును అక్మల్ సోదరులు ఆదుకున్నారు. మిర్పూర్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆసీస్ కెప్టన్ జార్జ్ బెయిలీ పాక్ కు బ్యాటింగ్ అప్పగించాడు. పాక్ 25 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ షెహజాద్ 5 పరుగులు చేసి బొలింజర్ బౌలింగ్ లో వెనుదిరగ్గా, కెప్టెన్ హఫీజ్ 13 పరుగులు చేసి వాట్సన్ బంతికి బౌల్డయ్యాడు. ఈ దశలో కమ్రాన్ అక్మల్ (20 బ్యాటింగ్), ఉమర్ అక్మల్ (25 బ్యాటింగ్) మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. ప్రస్తుతం పాక్ జట్టు 9 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లకు 69 పరుగులు చేసింది.