: చైనా సత్తా ఏపాటిదో తేలిపోయింది!
మలేసియా విమానం ఎంహెచ్ 370 ఆచూకీ కనిపెట్టేందుకు భారీస్థాయిలో రంగంలోకి దిగిన చైనాకు గర్వభంగం తప్పలేదు! 21 శాటిలైట్లు మోహరించి, ఓ చిన్నసైజు నావికాదళం, పెద్ద ఎత్తున విమానాలతో గాలింపు చర్యలో పాల్గొన్న చైనా చిన్న శకలాన్ని కూడా కనుగొనలేక ఉసూరుమనిపించింది. ఈ గాలింపు ప్రక్రియ ద్వారా చైనా సాంకేతిక పరిమితులు వెల్లడయ్యాయని నిపుణులు అంటున్నారు.