: రైనా ప్రపంచ రికార్డు


నిన్న పాకిస్తాన్ తో జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ మరో ప్రత్యేకత ఏమిటంటే... టీమిండియా క్రికెటర్ సురేశ్ రైనా ప్రపంచ రికార్డు సొంతం చేసుకున్నాడు. నిన్నటి మ్యాచ్ లో మూడు క్యాచ్ లు పట్టిన రైనా... టీ20 వరల్డ్ కప్ చరిత్రలో మూడు క్యాచ్ ల ఫీట్ ను రెండు సార్లు నమోదు చేసిన తొలి ఫీల్డర్ గా రికార్డు పుటల్లో స్థానం సంపాదించాడు. రైనా ఇంతకుముందు 2012లో శ్రీలంకలో జరిగిన టోర్నీలో దక్షిణాఫ్రికాపై మూడు క్యాచ్ లు పట్టాడు.

  • Loading...

More Telugu News