: పెట్రో ట్యాంకర్ ను ఢీ కొన్న రెండు బస్సులు
పాకిస్థాన్ లోని బెలూచిస్థాన్ లో పెట్రోల్ ట్యాంకర్ ను రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 35 మంది మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పాకిస్థాన్ నైరుతి ప్రాంతంలోని బెలూచిస్థాన్ సమీపంలో ఆర్సీడీ ప్రధాన రహదారిపై వేగంగా వస్తున్న రెండు బస్సులు ఎదురుగా వస్తున్న పెట్రోల్ ట్యాంకర్ ను ఢీ కొన్నాయి. వెంటనే మంటలు చెలరేగి క్షణాల్లో బస్సు మొత్తం వ్యాపించడంతో ప్రాణనష్టం సంభవించిందని, మృత దేహాలు గుర్తించడానికి కూడా వీలులేకుండా కాలిపోయాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.