: విశాఖ విమానాశ్రయంలో 2 కేజీల బంగారం స్వాధీనం
విశాఖ విమానాశ్రయంలో రెండు కేజీల బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి అక్రమంగా తీసుకువస్తున్న ఇద్దరు వ్యక్తుల నుంచి రెండు కేజీల బంగారాన్ని విమానాశ్రయంలోని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఆ ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.