: ఆర్ఎస్ఎస్ పై కేంద్ర మంత్రి ఖుర్షీద్ వివాదాస్పద వ్యాఖ్యలు


మహాత్మాగాంధీని పొట్టనపెట్టుకున్నది ఆర్ఎస్ఎస్ వ్యక్తులేనంటూ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రేపిన దుమారం చల్లారకముందే, కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్ కూడా అలాంటి వివాదాస్పద వ్యాఖ్యలే చేశారు. 'గాంధీని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలే హత్య చేశారు. అనంతరం వారు తమ ఇళ్లలో స్వీట్లు పంచి పెట్టుకున్నారు' అని ఖుర్షీద్ అన్నారు. ఉత్తరప్రదేశ్ లో తన నియోజకవర్గమైన ఫరూకాబాద్ లోని కయామ్ గంజ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆర్ఎస్ఎస్ పై నిషేధం విధించారని గుర్తు చేశారు. లోగడ రాహుల్ వ్యాఖ్యలపై ఇప్పటికే బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News