: ఆంధ్రప్రదేశ్ ను 'నవ్యాంధ్రప్రదేశ్'గా తీర్చిదిద్దుతాం: రఘువీరా
కార్యకర్తలతో మమేకం కావడానికే బస్సు యాత్ర చేపట్టామని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ను నవ్యాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో పదవులన్నీ అనుభవించిన కొందరు... కీలక సమయంలో పార్టీని వదిలి వెళ్లిపోయారని విమర్శించారు. నాయకులు పోయినా... కార్యకర్తలు మాత్రం పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారని తెలిపారు. విశాఖలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడారు. అత్యంత ప్రాధాన్యత కలిగిన పోలవరం ప్రాజెక్టు నిర్ణీత సమయంలో పూర్తవుతుందని చెప్పారు.