: కర్నూలు నగరం రాజధానిని త్యాగం చేసింది: బాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కర్నూలు ప్రజాగర్జన సభలో ఉద్వేగంతో ప్రసంగించారు. ముఖ్యంగా కర్నూలు నగరంపై ఆపేక్ష ప్రదర్శించారు. కర్నూలు రాజధానిని త్యాగం చేసిందని పేర్కొన్నారు. త్యాగాలకు నిలయం కర్నూలు అని కొనియాడారు. రాయలసీమ ఒకప్పుడు రతనాల సీమ అని పరిస్థితుల కారణంగా కష్టాలు తప్పడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పీవీ నరసింహారావును ప్రధానిని చేసిన ఘనత కర్నూలు జిల్లాకే దక్కుతుందని బాబు పేర్కొన్నారు. పీవీ నంద్యాల లోక్ సభ స్థానం నుంచి ఎన్నికైన సంగతి తెలిసిందే. ఇక మతసామరస్యానికి మారుపేరు కర్నూలు అంటూ మైనారిటీల మనసు చూరగొనే ప్రయత్నం చేశారు చంద్రబాబు.